ప్లానిటోరియంకి ప్రాజెక్టు డీపీఆర్..


Ens Balu
4
వీఎంఆర్డీఏ
2020-10-13 20:01:19

విశాఖలోని ప్లానిటోరియం ప్రాజెక్ట్ కి సంబందించిన DPR తయారీ బాధ్యతలు NCSM అనుబంధ సంస్థ అయిన నేషనల్ కౌన్సెల్ అఫ్ సైన్స్ మ్యూజియం, మినిస్ట్రీ అఫ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ ఇండియా , కోల్కతా వారికీ అప్పగించినట్టు వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వర్రావు తెలియజేశారు.  వీఎంఆర్డిఏ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ప్లానిటోరియం మ్యూజియం ఫై క్రియేటివ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ ఎం . డి సుబ్రతా సేన్ , అధికారులతో సహా కైలాసగిరి ను సందర్శించి సమీక్షించిన మెట్రోపాలిటన్ కమీషనర్  అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశం లో డిజైన్ , సీటింగ్ , డ్రోమ్  స్ట్రక్చర్ , ఇతర సాంకేతిక అంశాలపై మరియు DPR తయారీకి కావలసిన అంశాలను సవివరముగా చర్చించారు. డిసెంబర్ నెలాఖరులోగా DPR సిద్ధం  చెయ్యాలని క్రియేటివ్ మ్యూసియం డిజైన్నేర్స్ కమిషనర్ కోరారు. ఈ సమీక్ష లో కెలకత్తా సైన్స్ మ్యూసియం  (Ex) క్యూరేటర్ డా . జీలని , చీఫ్ ఇంజనీర్  కె రామ్ మోహన్ రావు,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  భవాని శంకర్, ఎలక్ట్రికల్ ఈ . ఈ సోమ శేఖర్, ఉమా శంకర్  తదితరులు పాల్గొన్నారు.