గ్రామాల్లో చెత్త నుంచి సంపదపై ద్రుష్టిపెట్టాలి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-14 19:36:49
గ్రామాల్లో చెత్త సేకరణతో కంపోస్టు తయారీ పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త అన్నారు అధికారులను ఆదేశించారు. . బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇ.ఓ.పి.ఆర్.డి.లతో, సెక్రటరీలతో జెసి (డి) వీరబ్రహం తో కలసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికీ కొన్నిచోట్ల చెత్త నుండి సంపద సేకరణ షెడ్ల నిర్వహణ జరగ లేదని వారం లోపు అన్ని షెడ్లు నిర్వహణ జరగాలని తరచూ పర్యటనలు చేపడతామని , అలాగే కోవిడ్ కాంటాక్ట్ ట్రెసింగ్ ల పై కూడా ఆలస్యంలేకుండా గుర్తించాలని జిల్లాలో 1330 మంది అన్ని గ్రేడ్ల సెక్రటరీలు వున్నారని ఇంతమంది వున్నా ఎస్.డబ్ల్యూ.పి.సి.షెడ్ల నిర్వహణ పూర్తి స్థాయిలోకి తీసుకురావడం లేదని మరో వారంలోపు ఎక్కడా ఖాళీ షెడ్లు కనిపించరాదని , అలా లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటికే కొన్ని మడలాలలో కంపోస్ట్ అమ్మకాలు జరిపి ఆదాయాన్ని తెస్తున్నారని అన్నారు. ఇ ఒ పి ఆర్ డి లు కోవిడ్ కాంటాక్ట్ , లక్షణాలు వున్న వారి గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారని గతమాసంలో బాగా నిర్వహించారని మరణాల రేటు తగ్గిందని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ వారి నుండి కనీసం సెకండరీ 10 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పంచాయితీల్లో హౌస్ టాక్స్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో తిరుపతి నుండి డి.ఎల్.పి.ఓ.లు రూపారాణి, రూపేంద్రనాధ్ రెడ్డి పాల్గొనగా , చిత్తూరు జిల్లా కేంద్రం నుండి జిల్లా పరిషత్ సి ఇ ఓ ప్రభాకర రెడ్డి, మనం మన పరిశుభ్రత జిల్లా కోయార్ది నేటర్ షణ్ముగ రామ్ , మండల కేంద్రాల నుండి ఇ.ఓ.పి.ఆర్.డి.లు, పంచాయితీ సెక్రటరీలు పాల్గొన్నారు.