సకాలంలో సరుకులు అందించాలి..
Ens Balu
2
Dasannapeta
2020-10-14 19:42:00
విజయనగరం జిల్లాలో రేషన్‌కార్డు దారులకు సకాలంలో నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ పౌరసరఫరాల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని దాసన్నపేట రింగురోడ్డు ప్రాంతంలో ఉన్న పౌరసరఫరాల సంస్థ నిత్యావసరాల గిడ్డంగి(మండల్ లెవల్ స్టాకు పాయింట్-1) ను జె.సి. బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రేషన్‌కార్డుల ద్వారా సరఫరా కోసం ఉద్దేశించి నిల్వ చేసిన కందిపప్పు, శనగలు, పంచదార, బియ్యం తదితర నిల్వలను పరిశీలించారు. రికార్డుల్లో పేర్కొన్న మేరకు నిల్వలు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, రాష్ట్ర ప్రజాపంపిణీ పథకంలో రేషన్‌కార్డులపై సరఫరా చేయాల్సిన సరుకులు కేటాయించిన మేరకు ఆయా రేషన్ డిపోలకు సకాలంలో చేరుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్‌కు గిడ్డంగిలో నిల్వ ఉన్న నిత్యావసరాలపై పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజర్ (టెక్నికల్) మీనాకుమారి, ఎం.ఎల్.ఎస్.పాయింట్-1 ఇన్‌చార్జి శ్రీనివాసరావు తదితరులు వివరించారు. ఈ పర్యటనలో అకౌంట్స్ ఏ.ఎం. రాజు కూడా ఉన్నారు.