వరద బాధితులకు ప్రభుత్వం అండ..
Ens Balu
5
యలమంచిలి
2020-10-14 20:25:29
వరదలలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మంత్రి ముంపునకు గురయిన ప్రాంతాలను రాంబిల్లి మండలం లో రజాల అగ్రహారం,వెల్చూరు, మర్రిపాలెం, కట్టు బోలు, పెద కలవలపల్లి గ్రామాలు, యలమంచిలి మండలం లో కట్టుపాలెం, తెరువుపాలెం గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముంపునకు గురయిన 7 గ్రామాల ప్రజలను ఆదుకుంటామని, వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పొలాల ముంపునకు శారదానదిపై నిర్మించిన వంతెన ఒక కారణమని చెబుతున్నారని, నేవీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గండి పూడ్చివేతకు పనులను వెంటనే చేపట్టవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను అదేశించామన్నారు. భవిష్యత్తులో యిటువంటి యిబ్బందులు రాకుండా శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బి.వి.సత్యవతి, శాసనసభ్యులు యు.వి. రమణమూర్తిరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.