వరదల తాకిడికి శుద్ధగెడ్డపై వంతెనే మార్గం..
Ens Balu
4
శుద్ధగెడ్డ
2020-10-14 20:49:24
శుద్ధగడ్డ వాగు రహదారిపై వంతెన లేక ఎప్పుడు వర్షాలు వచ్చినా పొంగి పొర్లుతూ రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. గత 3 రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కారణంగా వాగులోని వరద నీరు రహదారిని నిర్బంధించింది. వాగు పరిశీలన నిమిత్తం బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఆర్&బి ఎస్ఈ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా ఆర్&బి అధికారులను వంతెన నిర్మాణానికి తయారు చేసిన ప్రతిపాదనలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ, ఈ వాగు ప్రవాహం 20 రోజుల వరకూ వుంటుందని, ప్రతీ సంవత్సరం వర్షాలు కురిసినపుడు వరద నీటితో రహదారి నిర్బంధం అవుతుందన్నారు. ఈ వంతెన నిర్మాణం త్వరగా మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. ఈ వంతెన నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 3 కోట్లు అవుతుందని ప్రతిపాదనలు పెట్టామని కలెక్టర్ కు ఆర్&బి ఎస్ఈ తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి చిన్నింపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నీటి కాలువను పరిశీలించడానికి వెళ్లారు. ఈ బృందం కార్యక్రమంలో తహసీల్దార్ పి.గోపాలకృష్ణ, ఎంపీడీవోశ్రీలలిత, ఆర్&బి డిఇ ప్రకాశరావు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.