తలసేమియా బాధితుల కోసం రక్తదానం..


Ens Balu
3
Srikakulam
2020-10-15 15:49:39

మెగా సుప్రీమ్ స్టార్ ,సినీ నటుడు సాయిధరమ్ తేజ్ జన్మదినోత్సవం సందర్భంగా  అభిమానులు గురువారం శ్రీకాకుళంలో రక్తదానం చేసారు. సాయిధరమ్ తేజ్ యువత ఆద్వర్యంలో న్యూ బ్లడ్ బ్యాంక్ లో ప్రత్యేకంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసారు. తలసేమియాతో బాధపడుతున్న బాధితులకి డోనర్ కార్డులను అందజేసారు. అనంతరం కేక్ కట్ చేసి నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు.  ముఖ్యఅతిధులుగా రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్  ,శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ ,ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, జిల్లా సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు జోగిపాటి వంశీ,కిరణ్ , మౌళి,కార్తీక్ ,ఖాదర్ ,రాజు,రామ్ చరణ్ యువత అధ్యక్షులు తైక్వాండో గౌతమ్ ,చరణ్ ,వర్ధన్ సూరి,అంబేద్కర్ ,రమేష్ ,చంటి ,సంతోష్ ,టీం అల్లు అర్జున్ ప్రతినిధులు పుక్కళ్ళ నవీన్ , తాళాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.