కళ్యాణపులోవ మైనింగ్ లీజులు రద్దు..


Ens Balu
3
కళ్యాణపులోవ
2020-10-15 16:02:32

విశాఖపట్నం జిల్లా కళ్యాణపులోవ సాగునీటి రిజర్వాయర్ సమీపంలో, అటవీ సురక్షిత ప్రాంతంలో జరుగుతున్న గ్రానైట్ మైనింగ్ అనుమతులను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.  ఓ సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సాధ్యమైంది. నిరుపేద గిరిజన కుటుంబాలు, సామాజిక కార్యకర్తలు అజయ్ కుమార్, చక్రధర్ వంటి వారి నాయకత్వంలో జరుగుతున్న వ్యవసాయ కూలీల సంఘం లాంటి సంస్థల, వ్యక్తుల కృషి ఫలితంగా ఇది సాధ్యపడింది.. ఈ విషయమై విశాఖపట్నంలో ప్రజాకోర్టు నిర్వహించిన సమయంలో ఆ ప్రాంత గిరిజన రైతులు, కూలీలు, వారి పిల్లలు పెద్దసంఖ్యలో ఆ విచారణకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. మైనింగ్ తమ ఉసురెలా తీస్తోందో కన్నీటి పర్యంతమై వివరించి విముక్తి కావాలని ప్రభుత్వాన్ని అడిగారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, సామాజిక కార్యకర్త సజయ , ప్రొఫెసర్ రంగారావు, దిలీప్ రెడ్డి జ్యూరీగా వ్యవహరించి  ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని, శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని 'నో మైనింగ్ జోన్' గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన  వైఎస్ జగన్  ప్రభుత్వం అక్కడి మైనింగ్ లీజును రద్దు చేసింది. ఈ విజయాన్ని పోరాట యోధులంతా ప్రజా విజయగంగా ప్రకటించారు.