పాత రికార్డులన్నీ డిజలైజ్ చేయండి..


Ens Balu
3
ఎస్పీడీసిఎల్ కార్యాలయం
2020-10-15 16:16:28

ఎపిఎస్పీడిసిఎల్ కార్యాలయంలో ఉన్న పాత రికార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం నగరంలోని జెఎన్టీయూ రోడ్డులో ఉన్న ఎపిఎస్పీడిసిఎల్ ఎస్ ఈ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను డిజిటలైజేషన్ చేశారని, ఎపిఎస్పీడిసిఎల్  కార్యాలయంలో ఉన్న పాత రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాత రికార్డుల డిజిటలైజేషన్ వల్ల రికార్డులన్నీ జాగ్రత్తగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఫైల్స్ అన్నీ ఈ ఆఫీస్ లో నడుస్తున్నాయని, పాత రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎపిఎస్పీడిసిఎల్ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం గ్రిడ్ మ్యాప్ ను పరిశీలించి విద్యుత్ సరఫరాపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీడిసిఎల్ ఎస్ ఈ వరకుమార్, ఎడి కల్యాణ చక్రవర్తి, జె ఏఓ అరుణిమ, ఎపిఎస్పీడిసిఎల్ సిబ్బంది పాల్గొన్నారు.