రోడ్డు పనులు సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
4
Tirupati
2020-10-15 19:13:57

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పనులు సత్వరమే పూర్తిచేయాలని కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం డి.బి.ఆర్ రోడ్డు నుంచి రవీంద్ర నగర్ వరకూ గల 60 అడుగుల రోడ్డు, అక్కరంపల్లె మాస్టర్ ప్లాన్ రోడ్డు ను మరియు రేణిగుంట హీరో హోండా షోరూం వద్ద కలిపే రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లు, అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా కొంత మంది అభ్యంతరం చేస్తున్న వారితోనూ, భూములిచ్చిన రైతులకు చర్చించారు.  రోడ్డు నిర్మాణానికి 60 అడుగులు మాత్రమే కావాలన్నారు. అందులో భాగంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా సర్వే చేస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇస్తున్నామన్న కమిషనర్ ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తామన్నారు. ఈ రోడ్డు వేయడం వలన నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందన్నారు. అలాగే ఈ రోడ్డు వెంబడి భూములకు అధిక ధరలు వస్తాయన్నారు.  అనంతరం తూకి వాకం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ఇంజనీర్ అధికారులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారులు, నగరపాలక సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, రైతులు తదితరులు ఉన్నారు.