కొత్త తహశీల్దార్ల నియామకం..


Ens Balu
4
Srikakulam
2020-10-15 19:27:50

శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాలకు కొత్త తహశీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ జె నివాస్ గురు వారం ఉత్తర్వులు జారీ చేసారు. జిల్లాకు చెందిన ఏడు గురు ఉప తహశీల్దార్లను అడ్ హాక్ పదోన్నతి కల్పిస్తూ భూపరిపాలన ప్రధాన కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. అడ్ హాక్ పదోన్నతులు పొందిన ఉప తహశీల్దార్లు ఆర్.రమేష్ కమార్ ను  సీతంపేట తహశీల్దారుగా, జి.రమేష్ ను కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భూ సేకరణ యూనిట్ లో ప్రత్యేక తహశీల్దారుగా, ఎన్.అప్పారావును వీరఘట్టాం తహశీల్దారుగా, బి.అప్పలస్వామిని వజ్రపుకొత్తూరు తహశీల్దారుగా, ఎస్.నరసింహ మూర్తిని భామిని తహశీల్దారుగా, టి.సత్యనారాయణను హిరమండలం తహశీల్దారుగా, బి.పాపారావును  మందస తహశీల్దారుగా నియమించారు.  సీతంపేట తహశీల్దారుగా పనిచేస్తున్న పి.సోమేశ్వర రావును పాలకొండకు, శ్రీకాకుళం ఆర్.డి.ఓ కార్యాలయ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న ఎం.సావిత్రిని పాలకొండ ఆర్.డి.ఓ కార్యాలయంలో కె.ఆర్.ఆర్.సి తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. వజ్రపు కొత్తూరు తహశీల్దారు వి.నారాయణ మూర్తిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.