విధినిర్వహణలో అలసత్వంవహిస్తే ఇంటికే..


Ens Balu
3
ఎంవీపీ రైతుబజార్
2020-10-16 14:27:50

రైతుబజారు నిర్వహణలో అలక్ష్యం వహిస్తున్న ఎస్టేట్ అధికారిపై  జాయింటు కలెక్టరు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు బజారు నిర్వహణపై పలు పిర్యాదులు వస్తున్న  నేపధ్యంలో ఎం.వి.పి. రైతుబజారును శుక్రవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసున్నారు.  వారి సమస్యల పరిష్కారానికి సత్యరమేచర్యలు తీసుకుంటామని తెలిపారు.  రైతుబజారు రికార్డులను, కూరగాయల ధరలను  తనిఖీ చేసారు. రైతుబజారును తనిఖీచేసి  పారిశుద్యంనిర్వహణపై అసంతృప్తి  వ్యక్తంచేసారు. రైతుబజారును శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారిని  హెచ్చరించారు. రైతు బజారులో జరుగుచున్న అభివృద్ది పనులను తొందరగా పూర్తిచేయాలని మార్కెటింగుశాఖ, అసిస్టెంటు డైరెక్టరును ఆదేశించారు. రైతుల వసతిగృహం నిర్వహణ, పారిశుధ్యం అద్వాన్నంగా కలవని, ఇలా ఉంటే రైతులు ఎక్కడ ఉంటారని వెంటనే  శుభ్రం చేసి అందుబాటులోనికి తేవాలన్నారు.  పార్కింగు నిర్వహణ తీరుపై సమీక్షిస్తూ కొత్త కాంట్రాక్టరుకు అప్పగించేవరకు పార్కింగు  క్రమబద్దీకరణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.  ప్రస్తుతం రైతుబజారులో 256 మందిరైతులు ఉన్నారని, 178 షాపులు ఉన్నాయని  ఎస్టేట్ అదికారి తెలుపగా  రైతు బజారు అభివృద్దికి నివేదిక రూపొందించాలన్నారు.   రైతుబజారు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలురాకుండా చూసుకోవాలని మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులకు ఆదేశాలు జారీచేసారు.