పైపులైన్ పనులను సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
3
మింది
2020-10-16 19:55:41

జీవిఎంసీ పరిధిలోగల మింది, వెంకటాపురం, చిన్నముషిడివాడ  ప్రాంతాలలో ఇంజినీరింగు పనులను సత్వరమే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలసి జరుగుతున్న పలు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలనచేసారు. ఈ సందర్భంగా  రూ.16.82లక్షలు అంచనా వ్యయంతో మింది పంప్ హౌస్ కు ఆనుకొని ఉన్న కాళికానగర్ వద్ద మంచినీటి పైపులైను మార్పును ఇంజినీరింగు అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం, పెందుర్తి నందు 70వ వార్డు శారదాపీఠం వద్ద రహదారి వెడల్పు పనులు, ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. 66వ వార్డు వెంకటాపురం ప్రజల విన్నపము మేరకు ఎల్.జి. పాలిమేర్స్ వెనుకవైపు నుండి బైపాస్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు శ్రీధర్, రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు మురళీ కృష్ణ, ఇతర ఇంజినీరింగు అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు..