అర్హులందరికీ చిత్రావతి నష్టపరిహారం..


Ens Balu
3
మర్రిమాకుల
2020-10-16 20:11:00

చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో అర్హులందరికీ పరిహారం అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం సీబీఆర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయమై తాడిమర్రి మండలం మర్రిమాకుల పల్లి ఎస్ఈ కాలనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పరిహారం విషయమై ప్రజలతో మాట్లాడి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీబీఆర్ కింద ముంపునకు గురవుతున్న గ్రామాలలో ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారందరికీ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముంపునకు గురవుతున్న గ్రామాలలో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూస్తామని, తప్పకుండా అర్హులైన వారికి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారు ఎవరూ మిస్ కావడానికి వీలు లేదన్నారు. సీబీఆర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు పూర్తి అవుతుండడంతో రిజర్వాయర్ లో వెంటనే 10 టీఎంసీల నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.