చంద్రబాబు కాస్త బుర్రుంటేవాడు..ఎమ్మెల్యే అమర్నాద్
Ens Balu
2
2020-07-19 17:42:04
సింహాచలం దేవస్థానంకు సంబంధించి కేరళలో ఉన్న అనంతపద్మనాభం ట్రస్టుతో పోలుస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అసలు అనంతపద్మనాభం ట్రస్టుకు, సిం హాచలం దేవస్థానంకు సంబంధమే లేదని అమర్నాథ్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు సంబంధించిన వ్యక్తి బ్రతికి ఉండగానే దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది చంద్ర బాబే అని అమర్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు, పార్టీ చంద్రబాబు చేతికి ఎలా వచ్చిందని అమర్ ప్రశ్నించారు. ఈరోజు చంద్రబాబు నీతులు చెప్పటం ఏంటని అమర్నా థ్ మండిపడ్డారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు కుట్ర కోణం బయటపడిందన్నారు. రాజధానికి భూములు ఇవ్వలేదని అరటితోటలు తగలపెట్టినప్పుడు చంద్రబా బు కుట్ర ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు ఉద్యమం చేస్తున్నారని తునిలో రైలు తగలబెట్టి0చి రాజకీయ లబ్ది పొందాలని చూశారన్నారు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంటే స్మగ్లర్లను కాపాడటం కోసం రైతు కూలీలను పొట్టన పెట్టుకొని చంపారు. ఆ ఎర్రచందనం దుంగలు చంద్రబాబు పొలంలోనే దొరికాయని అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు పేరు మీద ఉన్న పొలంలో ఎర్రచందనం దుంగలు దొరికిన విషయం మర్చిపోయారా.. అని అమర్నాథ్ ప్రశ్నించారు.