కిసాన్ రైల్ ట్రస్ట్ కు రూ.లక్ష విరాళం..
Ens Balu
3
అనంత కలెక్టరేట్
2020-10-17 13:28:41
కిసాన్ రైల్ ట్రస్టుకు అందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలన్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపుకి మంచి స్పందన లభిస్తోంది. శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.లక్ష చెక్కును ఎంపీ రంగయ్య ద్వారా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కిసాన్ రైలు కోసం, రైతుల కోసం మంచి కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేపట్టారన్నారు. దాతలు ఇచ్చే మొత్తం కిసాన్ రైలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇలాంటి సమయంలో కిసాన్ రైలు ద్వారా రైతలుకు మేలు చేయాలనే ఉద్దేశ్యం జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన రావడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జెసి డా.సిరి తదితరులు పాల్గొన్నారు.