కోవిడ్ ను ఆత్మస్తైర్యంతో ఎదుర్కోవాలి..
Ens Balu
2
సర్వజన ఆసుపత్రి
2020-10-17 13:30:59
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అభయమిచ్చారు. శనివారం నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కోవిడ్ వార్డును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పాజిటివ్ వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, వ్యాధి నుంచి త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా భోజనం సమయానికి ఇస్తున్నారా, లేదా, ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, డాక్టర్ లు సరైన చికిత్స అందిస్తున్నారా, ఆరోగ్యం బాగా ఉందా అనే విషయాలపై జిల్లా కలెక్టర్ అరా తీశారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని పాజిటివ్ వచ్చిన వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. పాజిటివ్ వచ్చినవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.