ఈనెల 19నుంచి సర్టిఫికేట్లు పరిశీలన..
Ens Balu
1
Gurukulam
2020-10-17 13:57:00
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుండి విద్యార్ధుల సర్టిఫికేట్లను పరిశీలన చేయనున్నట్లు మహాత్మా జ్యోతీ బాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (బాలుర) ప్రిన్సిపాల్ జల్లు లక్ష్మణ మూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంపోలు శాస్త్రుల పేట వద్ద గల బాలుర పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి లాటరీ పధ్ధతి ద్వారా ఎంపికైన విద్యార్ధుల సర్టిఫికేట్లను ఈ నెల 19 మరియు 20వ తేదీలలో పరిశీలించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్ధి, రికార్డు షీట్స్, తల్లి తండ్రుల మరియు విద్యార్ధుల ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు, రేషన్ కార్డు, కుల ధృనీకరణ పత్రం జెరాక్స్ కాపీలు మరియు 1- 4 వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లు ఒరిజనల్, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్, తల్లి యొక్క బ్యాంకు పుస్తకం జెరాక్సు కాపీ, విద్యార్ధి యొక్క ఆరు పాసు పోర్టు సైజ్ ఫోటోలు, తల్లి తండ్రుల ఫోటోలు నాలుగు తీసుకు రావాలని తెలిపారు.