అనంతలో ప్లాస్మా అఫెరెసిస్ యంత్రం ప్రారంభం..


Ens Balu
3
సర్వజన ఆసుపత్రి
2020-10-17 14:24:04

 అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని అనంతపురం, హిందూపురం ఎంపిలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంతకుముందు ఆగస్టు లో జరిగిన కోవిడ్ రివ్యూ మీటింగ్ లో, అంతకుముందు జరిగిన సమావేశాలలో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి విన్నవించగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ ట్రీట్ మెంట్ లో భాగంగా ప్లాస్మా థెరపీ ని మొదలుపెట్టామని, అందులో భాగంగా 170 మందికి ప్లాస్మా ట్రీట్మెంట్ చేసి వారి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ప్లాస్మా కోసం ఇంతకుముందు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ పై ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఇక్కడే ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అలాంటి పరిస్థితుల నుంచి బయట పడ్డామన్నారు. భవిష్యత్తులో కోవిడ్ ట్రీట్మెంట్ నే కాకుండా ఇతర అన్ని రకాలుగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రం ఉపయోగపడుతుందని, పాజిటివ్ వచ్చిన వారికి మంచి మెడికల్ సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 12 కోవిడ్ ఆస్పత్రిలు ఉన్నాయన్నారు. ఆసుపత్రులలో కోవిడ్, నాన్ కోవిడ్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, అనంతపురం సర్వజన ఆసుపత్రి లో దశలవారీగా  కోవిడ్, నాన్ కోవిడ్ కేసులు టేకప్ చేయడం జరుగుతుందన్నారు. మునుపటి మాదిరిగానే కోవిడ్, నాన్ కోవిడ్ సర్వీసులు అందిస్తామని, దశలవారీగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ కేసులకు వైద్య సేవలు అందించడం  జరుగుతుందన్నారు.జిల్లాలో 5 శాతం కంటే పాజిటివిటి రేటు తక్కువగా ఉందని, జిల్లాలో 17 కోవిడ్ కేర్ సెంటర్ లు ఉండగా 8 తగ్గించామని, వాటిలో కూడా 1,2 కోవిడ్ కేర్ సెంటర్ లు మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్లాస్మా అఫెరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు సాధ్యమైందన్నారు. కోవేట్ బారిన పడినవారికి వైద్య సేవలు అందించడం ఒక యుద్ధం లాంటిదని, ప్లాస్మా అఫరెసిస్ యంత్రం ఏర్పాటు వల్ల వైద్య సేవలు అందించేందుకు ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలు అద్భుతంగా అందిస్తున్నారని, ప్లాస్మా అఫరెసిస్ యంత్రం మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ఇంచార్జ్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, ఆడిసినల్ డిఎంఅండ్హెచ్ఓ రాము సుబ్బారావు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.