యంగ్ అచీవర్ నిఖితకు మంత్రి కితాబు..
Ens Balu
4
Seethammadara
2020-10-17 14:34:22
ఆ విద్యార్ధిని ఏయూలో జర్నలిజం చదువుతూనే తన టేలంట్ ను నిరూపించుకుంది. అవార్డులతో విశాఖ కీర్తిని దేశ స్థాయిలో చాటింది. దీంతో విశాఖలోని శనివారం నగరంలోని సితమ్మధార క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యంగ్ అఛీవ్ మెంట్ అవార్డు గ్రహీత చల్లపిల్లి నిఖితను స్వయంగా అభినందించాలరు. ప్రతి సంవత్సరం నిర్వహించే వి ఇండియా అవార్డ్స్ కోసం ..ఈ సంవత్సరానికి (2020) నిర్వహించిన వుమెన్ ఎక్సలెంట్ అఛీవ్ మెంట్ అవార్డులు లలో భారతదేశం నుంచి విద్యార్దిని నిఖిత ఎమోషనల్ ఎడ్యుకేషన్ టు వుమెన్ అనే అంశం పై అవార్డ్ ను కైవసరం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింతగా రాణించాలని, మరెన్నో అవార్డులను తెచ్చుకోవాలని ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.