నాడు-నేడు పనుల్లో తేడాలొస్తే ఉపేక్షించేది లేదు..


Ens Balu
6
Anakapalle
2020-10-17 15:53:32

అనకాపల్లి నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు పాఠశాలలు తెరిచేనాటికి పూర్తిచేయాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అధికారులను ఆదేశించారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే సమయానికి పాఠశాలలన్నీ చక్కగా కనిపించాలన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో నాణ్యతలో రాజీలేకుండా అన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తాను స్వయంగా పరిశీలిస్తానని ఎక్కడ తేడా వచ్చినా చర్యలు తప్పవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పట్టణ కార్యదర్శి సూరి శెట్టి రమణ అప్పారావు, జాజుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..