సెక్రటరీ, వీఆర్వోలకు షోకాజ్ నోటీసులివ్వండి..


Ens Balu
2
Rapthadu
2020-10-17 19:35:43

గ్రామసచివాలయాల్లో సిబ్బంది విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెసి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం, హంపాపురం గ్రామసచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజలకు సచివాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. ఏ ఒక్కరూ గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు రాకుండా సమస్యలు ఇక్కడే పరిష్కారం కావాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహించిన విఆర్వో, గ్రామ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను, నోటీసు బోర్డులను పరిశీలించారు. పెండింగ్ 55 దరఖాస్తులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు సచివాలయం నుంచే జారీచేయాలని సిబ్బందిని ఆదేశించారు.