జర్నలిస్టుల సమస్యల పరిష్కారాని క్రుషి..
Ens Balu
2
Visakhapatnam
2020-10-17 20:01:21
విశాఖ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ,ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షుడు పి నారాయణ్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి ఆనంద్ తదితరులు వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జర్నలిస్టులతో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయిన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి జర్నలిస్టుల కృషి వారు తనకు ఇచ్చిన సలహాలు , తనకు , ఎంతోగానో ఉపకరించాయిన్నారు. భవిష్యత్‌లో కూడా తన వంతు సహకారం వారికి అందిస్తానని అలాగే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కోన్నారు. జర్నలిస్టుల అభివ్రుద్ధికి సీఎం కూడా క్రుత నిశ్చయంతో ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు.