సచివాలయాల ద్వారా 100% సేవలు అందాలి..


Ens Balu
5
జీవిఎంసీ ప్రధాన కార్యాలయం
2020-10-17 20:21:18

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడనాకి అన్నిశాఖల అధికారులు శక్తివంచన లేకుండా క్రుషిచేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను కోరారు. శనివారం  జివిఎంసికి సంబందించిన పలు విభాగాల పనితీరును  ప్రజా ప్రతినిదులు, జివిఎంసి కమీషనర్ తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అడిగిన పలు సమాదానాలకు సంబందిత విభాగాదిపతులు సవివరమైన సమాదానాలు బదులిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు విషయాలను మంత్రి అడుగగా కమిషనర్ సమాధానమిస్తూ కార్పోరేషన్ 572 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసామని, వాటిలో వివిధ కేటగిరీలలో కార్యదర్శులు ప్రభుత్వ అదేశాల ప్రకారంగా పరిపాలన కార్యదర్శుల అధ్వర్యంలో విదులు  నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సచివాలయాల పరిధిలో 10,200 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.  రెవెన్యూ విభాగపు పనితీరును సమీక్షిస్తూ మంత్రివర్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానమిస్తూ సంవత్సరమునకు రూ.350.00 కోట్లు ఆస్తి పన్ను, రూ.150.00 కోట్లు నీటి చార్జీలు రూపంలో, పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా రూ.100.00 కోట్లు రాబడి రాగా, ఆ మొత్తంతోనే కార్పోరేషన్ నిర్వహణ చేస్తున్నామన్నారు. పట్టణ ప్రణాళిక పనితీరుపై మంత్రివర్యులు సమీక్షిస్తూ ఇంటికి ప్లాను మంజూరు జరుగుతున్న విదానం, అక్రమ కట్టడాల నియంత్రణ, బిపీఎస్ అమలు తీరుపై చర్చించగా చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత సమాధానమిస్తూ ప్రభుత్వ ఆదేశాల పరంగా ఓబిఎమ్ఎస్ పద్దతి ద్వారా ఇండ్ల నిర్మాణ ప్లానులను మంజూరు జరుగుతున్నదని, బిపిఎస్ విదానం కింద 6120 అప్లికేషన్లు రాగా 5800 అప్లికేషన్లు పరిష్కరించబడగా మిగిలినవి నెల ఆఖరిలోగా పరిష్కరిస్తామన్నారు. సాంకేతిక పరంగా కొత్త యాప్ ను ప్రస్తుతం నగరంలో జరుగుతున్న నిర్మాణదశలో ఉన్న కట్టడాలను గుర్తిస్తున్నామన్నారు. జివిఎంసి ఇంజినీరింగు పనితీరుపై సమీక్షించగా ప్రధాన ఇంజినీరు బదులిస్తూ ఈ సంవత్సరంలో రూ.382.00కోట్లు ప్రతిపాదిత పనులు ప్రారంబించడమైనదని, రూ.130.00 కోట్లు పనులు సాధారణ పనులైన రోడ్లు, కాలువల పనులు సంబందించినవి ప్రధాన ఇంజినీరు వివరించారు. కాపులుప్పడ దంపింగు యార్డులో చేపడుతున్న చెత్త రహిత ప్రాజెక్టులపై మంత్రివర్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సవివరణమైన సమాధానమిచ్చారు. ప్రజారోగ్య పనితీరుపై కమిషనర్ సమాధానమిస్తూ, ఉన్నకార్మీకులతోనే జివిఎంసి పరిధిలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని, వాటి పనితీరును కూడా క్షేత్ర స్థాయిలో వివిధ స్థాయి అధికారులు పరిశీలన చేస్తన్నారని కమిషనర్ వివరించారు. నగరంలో ఆధునిక స్మశాన వాటికల  ఏర్పాటు   గురుంచి  మంత్రివర్యులు  వివరణ అడుగగా, ఇప్పటికే నగరంలో మూడు చోట్ల చావులమదుం, బక్కన్నపాలెం, గాజువాక స్మశాన వాటికల ఆధునికరణకు చర్యలు చేపడుతున్నామని, అనకాపల్లి, పెందుర్తిలలో ఆధునిక స్మశాన వాటికలు నిర్మాణానికిగల అవకాశాలను పరిశీలిస్తున్నామని కమిషనర్ వివరించారు. కోవిడ్ పై కమిషనర్ వివరిస్తూ, జూలై నుండి నేటివరకు 1,66,000 టెస్టులు చేయగా 24000 కేసులు పోజిటివ్ గా గుర్తించామని, మొదటిలో నూటికి సుమారు 30 శాతం పోజిటివ్ కేసులు రాగా, ప్రస్తుతం 3 నుండి 4 శాతం  వరకు కేసులు నమోదు అవుతున్నాయని కమిషనర్ మంత్రివర్యులకు వివరించారు. పట్టణ సామాజిక అభివృద్ధి పనితీరుపై మంత్రి సమీక్షిస్తూ గ్రామీణ విశాఖ బ్యాంకుల్లో ప్రతీ రోజు తక్కువ గ్రూపులకు ఆర్ధిక సహాయం జరుగుచున్నదని, ఈ విదంగా జరిగితే అనుకున్న టార్గెట్ ను చేరుకోలేమని కావున యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ ను గ్రామీణ బ్యాంకు మేనేజరుతో చర్చించి ఎక్కువ మహిళా గ్రూపులకు ఆర్ధిక సహాయం అందించాలని సూచించారు. నగర పరిధిలో గల శాసన సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కమిషనర్ మరియు సంబందిత విభాగాదిపతులు సమాధానమిచ్చారు.            ఈ సమీక్షా సమావేశంలో శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎ.అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, నియోజిక వర్గ సమన్వయ కర్తలు  కె.కె.రాజు, వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్, అదనపు కమిషనర్లు అవ్వారి వెంకట రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు వెంకటేశ్వర రావు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాస రావు, డిసి(ఆర్) ఫణిరాం, పర్యవేక్షక ఇంజినీరులు  తదితరులు  పాల్గొన్నారు.