అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
1
పార్వతీపురం ఐటిడిఏ
2020-10-18 12:09:29

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి.ఏ పరిధిలో ఉన్న 33 అంగన్వాడీ కార్యకర్తలు, 89 హెల్పర్లు, 28 మినీ అంగన్వాడీ కర్యకర్తల పోస్టులకు ఆర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తులు ఈ నెల 21 తేదీ నుంచి 27 తేదీలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారిణి ఐ. సి.డి.ఎస్ ప్రాజెక్ట్ వారి కార్యాలయానికి నేరుగా గాని, రిజిష్టర్ పోస్ట్ ద్వారా గాని అందజేయవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ గ్రామ వివాహిత అయి ఉండి, 2020 జూలై ఒకటవ తేదీ నాటికి 21- 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, అలాగే 10వ తరగతి ఉత్తీ ర్ణులై ఉండాలని పేర్కొన్నారు.  రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  వికలాంగులకు కేటాయించిన ఖాళీలను వినికిడి లోపముగల అభ్యర్థులు హియరింగ్ ఎయిడ్ తో వినగలిగి, సంభాసించగలిగి ఉండాలి.  శారీరక వికలాంగులు పిల్లల సంరక్షణ చేపట్టగలిగి, పూర్తి ప్రాథమిక విద్యా నేర్పించగలిగి ఉండాలి,. దృష్టి లోపముగల అభ్యర్థులు ఇతరుల సహాయ సహకారం లేకుండా విధులు నిర్వహించగలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుతో సంబంధిత దృవ పత్రాలు గజిటెడ్ ఆఫీసర్ తో  ఆటేస్టేషన్ చేయించి జత చేయాలని అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఆసలు ధ్రువపత్రాలు తప్పక తీసుకొని హాజరుకావాలని తెలిపారు. ఈ ప్రక్రియలో మార్పులు, చేర్పులు, రద్దు చేయుటకు పూర్తి హక్కులు ఉన్నట్లు తెలియజేశారు.