రేపు డయల్ యువర్ కమిషనర్


Ens Balu
1
జీవిఎంసీ కార్యాలయం
2020-10-18 14:13:22

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా విన్నవించుకోవచ్చునని కమిషనర్ డా.స్రిజన పేర్కొన్నారు. ప్రతీసోమవారం జివిఎంసీ ప్రధానకార్యాలయంలో ఫోను  1800-4250-0009 నెంబరు ద్వారా ఉదయం 10.00 గం. నుండి 11 గంటలవరకూ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కోవిడ్ ను ద్రుష్టిలో పెట్టుకొని, డయల్ యువర్ కమిషనర్, మధ్యాహ్నాం 11 నుంచి ఒంటి గంటవరకూ ఈ స్పందన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మెయిల్ ద్వారా కూడా సమస్యలను పంపి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కోవిడ్ సమయంలోనూ అన్నిరకాలుగా అధికారులు సిద్దంగా వున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అదేవిధంగా వార్డుల్లో కూడా ప్రజలు వార్డుసచివాలయాల్లో ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను నేరుగా జీవిఎంసిలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు.