కరోనా నియంత్రణలో ప్రతీఒక్కరూ భాగస్వామి కావాలి..
Ens Balu
1
Dwaraka Nagar
2020-10-18 14:17:50
కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని ప్రముఖ సామజసేవకులు సానారాధ పిలుపునిచ్చారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. వైరస్ ఉద్రుతి తగ్గిందనే అపోహలు మానుకొని, వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దసరా నవరాత్రుల వేళ ఒకే సారి అధిక సంఖ్యలో దేవలాయాల్లో భక్తులు వెళ్లకూడదని సూచించారు. ఒకవేళ వైరస్ సోకి పాజిటివ్ వచ్చినా ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఇంటి పట్టునే ఉండి వైద్యసేవలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటూ, నిపుణుల సలహామేరకు ఎప్పటి కప్పుడు ఆవిరి పట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూనే, ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేయడానికైనా ముందు సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని కోరారు. నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే వినియోగించాలని, తక్కువరకం శానిటైజర్లు వినియోగించి చర్మవ్యాధులు కొని తెచ్చుకోవద్దని కూడా సానా రాధ ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్పా, బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారిని, ఐదేళ్ల లోపు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలని ఆమె మీడియా ద్వరా ప్రజలను కోరారు...