విసిఐసి సౌత్ బ్లాక్ సర్వే త్వరగా పూర్తి చేయండి..
Ens Balu
0
Tirupati
2020-10-18 18:53:15
చిత్తూరు జిల్లాలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ సర్వే సౌత్ బ్లాక్ లోని 13 వేల ఎకరాలు త్వరగా పూర్తి చేయాలని ఎపిఐఐసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఐ.ఎ. ఎస్. సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో విసిఐసి పై డైరెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త, ఆర్డీవో కనకనరసారెడ్డి కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్ తో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి వస్తుంది ప్రాధాన్యత నివ్వాలని ప్రత్యేక దృష్టి అవసరం, కొవిడ్ వల్ల ఆలస్యం రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి కొవిడ్ విధులు నిర్వహించారు అన్నారు. ఇప్పుడు విసిఐసి భూసేకరణ సర్వే సౌత్ బ్లాక్ లోని 13 వేల ఎకరాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో తిరుపతి డివిజన్లలో విసిఐసి కారిడార్ 24 వేల ఏకరాలుగా వుందని, నార్త్ బ్లాక్ 11 వేల ఎకరాలు ,సౌత్ బ్లాక్ 13 వేల ఎకరాలుగా వుందని సూచించారు. సౌత్ బ్లాక్ విలేజ్ వైస్ సర్వే పూర్తి చేయాలని సూచించారు. నెల్లబల్లి - రౌతు సూరమాల రహదారి కి స్టార్టప్ ఏరియా ప్రాధాన్యత నిచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. కారిడార్ బ్రిడ్జెస్ ఎన్. హెచ్., ఆర్ అండ్ బి ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించారు. ఇండస్ట్రియల్ అవసరాలకు 45 కిమి కండలేరు వాటర్ లైన్ ప్రతిపాదనలు ఈనెల 21 నాటికి పూర్తిచేసి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ సౌత్ బ్లాక్ రెండు మండలాలు తొట్టంబేడు లో 11 గ్రామాలు, బి.ఎన్. కండ్రిగలో 7 గ్రామాలకు సంబంధించి సర్వే 13 వేలకు గాను 7 వేలు పూర్తి అయిందని తెలిపారు. పట్టాభూములు ఇక్కడ 160 ఎకరాలు కాగా మిగిలినది డికెటి భూములు అని తెలిపారు. అక్టోబర్ 31 కి నాటికి స్టార్టప్ ఏరియా రౌతుసూరమాల వద్దమరో 500 ఎకరాల డికేటి అవార్డు పాస్ చేస్తామని సూచించారు. క్రిష్ణ పట్నం పోర్టు నుండి శ్రీసిటీ, పరిశ్రమల ఎగుమతులకు తప్పనిసరి కస్టమ్స్ డ్రై పోర్ట్ అవసరమని ఇక్కడే పర్మిషన్ వస్తుందని కోరారు. ఉత్పత్తులు చెన్నై కు వెళ్లే ఇబ్బందులు తప్పు తాయని డైరెక్టర్ ను కోరారు. ఆర్డిఓ వివరిస్తూ ఆలస్యానికి కారణం 300 ఎకరాలు సేకరణ అనంతరం ఏపీఐఐసీ అధికారులు కొంతకాలం ఆపమని సూచించారని తెలిపారు. రౌతు సూరమాల వద్ద స్టార్టప్ ఏరియా 2700 ఎకరాలకు గానూ 1067 పూర్తి అయిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.36 కోట్లు పరిహారం అందించామని తెలిపారు. డికేటి పరిహారం రూ.8 లక్షలు గా ఉందని తెలిపారు.సౌత్ బ్లాక్ పరిహారం కోసం రూ. 50 కోట్లు అవసరమని తెలిపారు. సమీక్షలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎల్.రామ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఏపీఐఐసీ సంబంధించిన శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.