రెడ్ క్రాస్ సేవలు మరింత విస్త్రుతం..


Ens Balu
3
Tirupati
2020-10-18 19:43:48

తిరుపతి డివిజన్ లో కొత్తగా ఏర్పాటైన రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయాన్ని స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్ ను ఆదివారం ఉదయం తిరుపతి ఆర్డిఓ, రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్ కనకనరసా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వైద్య సేవల్లో ముందుండే రెడ్ క్రాస్ తిరుపతి డివిజన్ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ లో కార్యాలయం కోసం  టిటిడి స్పందించి కేటాయింపు చేయడం శుభ పరిణామమని అన్నారు. స్థానిక శాసన సభ్యులు కారుణాకరరెడ్డి, తుడా చైర్మన్ సహకారంతో కార్యాలయం మరింత సభ్యులతో సేవకార్యక్రమాలు రూపుదిద్దుకోవలని ఆసిస్తున్నానని అన్నారు.  కొవిడ్ సమయంలో ఆసుపత్రుల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవాలందించారని అన్నారు. బ్లడ్ డోనేషన్, సీపీఆర్ క్యాంపు ల నిర్వహణలు మరిన్ని నిర్వహించి మండల స్థాయిలో కూడా సేవాలందించాలని కోరారు.  కొవిడ్ సేవలందించిన రెడ్ క్రాస్ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందించారు.