శ్రీ కనకమహలక్ష్మి కి గంట్ల ప్రత్యేక పూజలు


Ens Balu
1
Sri Kanakamahalakshmi Ammavari Temple
2020-10-19 13:06:53

దేవిశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ,అమ్మలగన్న అమ్మ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి క్రుపతో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ జరగాలని,జర్నలిస్టు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ గతంలో పోల్చుకుంటే ఇపుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సూచనల మేరకు జర్నలిస్టులు ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలకు కవరేజికి వెళ్లే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. వీలైనంత వరకూ హేండ్ గ్లౌజ్ లు వేసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో నాణ్యమైన శానిటైజర్లును వినియోగించాలన్నారు.  జర్నలిస్టులు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలతోమాత్రమే  విధులకు హాజరు కావాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా తాను అహర్నిసలు పనిచేస్తున్నట్టు గంట్ల వివరించారు.