‌స్కిల్‌ ఐఓ ‌యాప్‌ ఆవిష్కరణ..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-19 15:31:09

పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా నిలచే విధంగా స్కిల్‌ ఐఓ ‌యాప్‌ను తీర్చిదిద్దడం హర్షణీయమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో ఆయన యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యే విధంగా యాప్‌ ‌రూపకల్పన చేయడం మంచి పరిణామమన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం ఎక్కడనుంచయినా సులభంగా ఈ యాప్‌ను వినియోగించవచ్చునన్నారు. విద్యార్థి నిరంతరం తన ప్రతిభను మెరుగు పరచుకోవడానికి, పోటీ తత్వానికి అనుగుణంగా తన నైపుణ్యాలను వృద్ది చేసుకోవడానికి ఈ యాప్‌ ఎం‌తో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. బ్రైన్‌ ఓ ‌విజన్‌ ‌సంస్థ  సిఓఈ గణేష్‌ ‌నాగ్‌ ‌దొడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సమర్ధ సేవలు అందించే ఉద్దేశంతో ఈ యాప్‌ను తమ సంస్థ రూపకల్పన చేసిందన్నారు. యాప్‌ను 9 భాషల్లో 40వేలకుపైగా  టెస్ట్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ యాప్‌ ‌సహాయంతో విద్యార్థులు నిత్యం తమ ప్రతిభను, ప్రగతిని మెరుగు పరచుకోవడం సాధ్యపడుతుందన్నారు.