సిట్ దర్యాప్తు కు సమాచారం అందించాలి..


Ens Balu
6
Visakhapatnam
2020-10-19 15:58:22

విశాఖజిల్లాలో భూ ఆక్రమణలపై సిట్ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు దర్యాప్తు బృందానికి సమాచారం అందజేయాలని సిట్ బృందం అధ్యక్షులు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్క్యూట్ హౌస్ లో సోమవారం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు.  కరోనా నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగలేదని దర్యాప్తును తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు బృందం సభ్యులు వై.వి.అనూరాధ, రిటైర్డ్ జడ్జి టి. భాస్కరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.