ఏయూ ఆసెట్‌ ‌పరీక్ష ఫలితాలు విడుదల..


Ens Balu
3
ఆంధ్రా యూనివర్శిటీ
2020-10-19 16:05:27

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్‌, ‌సమీకృత ఇంజనీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్‌ ‌పరీక్షల ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన మూడు రోజుల్లో ఫలితాలు సిద్దం చేయడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడికి సమర్ధవంతంగా కృషిచేసిన ప్రవేశాల సంచాలకుల కార్యాలయం అధికారులను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్‌ ‌బాబు, ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు,  అసోసియేట్‌ ‌డైరెక్టర్లు ఆచార్య ఎస్‌.‌బి పడాల్‌, ‌డాక్టర్‌ ‌సి.వి నాయుడు, సెట్‌ ‌సభ్యులు డి.బి వెంకటాద్రి, డాక్టర్‌ ఎస్‌.‌పాల్‌ ‌డగ్లస్‌, ‌డాక్టర్‌ ‌పి.వి లక్ష్మీనారాయణ, డాక్టర్‌ ఎన్‌.‌సాలమన్‌ ‌బెన్నీ తదితరులు పాల్గొన్నారు. ఆసెట్‌ ‌ప్రవేశ పరీక్షకు 17568 మంది దరఖాస్తు చేయగా, 14732 మంది హాజరయ్యారు. ఆఈట్‌ ‌పరీక్షకు 1909 మంది దరఖాస్తు చేయగా 1259 మంది  హాజరయ్యారన్నారు. కెమికల్‌ ‌సైన్స్ ‌విభాగంలో 93 మార్కులతో కోనాల అర్షిత భవ్య ఆసెట్‌లో టాపర్‌గా నిలచారు. ఆఈట్‌లో 80 మార్కులతో కె.శ్రీ క్రిష్ణ వెంకట సుబ్బారావు ప్రధములుగా నిలచారన్నారు.  పరీక్షల ఫలితాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్‌ www.audoa.in లో పొందుపరిచారు. ఫలితాలు విడుదల అనంతరం వీపీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ త్వరలో కౌన్సెలింగ్‌ ‌తేదీలను ఖరారు చేసి వెల్లడిస్తామన్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు సైతం రికార్డు సమయంలో కేవలం 20 రోజుల్లో అందించే దిశగా అధికారులు పనిచేస్తున్నారన్నారు.