ప్రజాధనం ప్రైవేటు లేవుట్ కి ఖర్చుచేస్తున్నారు..


Ens Balu
3
Endada
2020-10-20 14:43:36

విశాఖలోని సాగర్‌నగర్‌-ఎం‌డాడ పెట్రోల్‌ ‌బంక్‌ ‌వరకూ రోడ్డు నిత్యం ప్రజలు నడిచేదని ఈ రోడ్డును వేయకుండా జివిఎంసి అధికారులు, ఇంజినీర్లు అక్కడ గల ప్రభుత్వ చెరువులోంచి ముందుగా ప్రైవేట్‌ ‌లే అవుట్‌కు రూ.42లక్షలు అక్కడ వెచ్చించడం నిబంధనలకు విరుద్దమని సిపిఎం నగర కార్యదర్శి గంగారావ్ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగర్‌ ‌నగర్‌- ఎం‌డాడ ప్రజలు నడిచే దారిని వేసేందుకు 20 రోజులుగా మట్టిపోస్తున్నారే తప్ప తారు రోడ్డు వేయడం లేదన్నారు. అదే ప్రైవేట్‌ ‌లే అవుట్‌ ‌కోసం ఒక్క రాత్రికి రాత్రే అందమైన రోడ్డును జివిఎంసి వేయడం ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. ప్రైవేటు లేవుట్ లకోసం చూపించే శ్రద్ధ ప్రజాపయోగ పనులకు చేపట్టం లేదన్నారు. ప్రైవేట్‌ ‌లే అవుట్ల కోసం జివిఎంసి ఇంజినీర్లు రోడ్డు వేయించే క్రమంలో లాంచాలకు పాల్పడే ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నారు.  అంతేగాక ప్రభుత్వ చెరువు గర్భం ఎకరా 62 సెంట్ల భూమిని కూడా ఆక్రమించినా రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధికి లబ్ధిచేకూర్చడం కోసమే చూస్తున్నారన్నారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్‌ ‌నరసింగరావు, గ్రేటర్‌ ‌విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ ‌బి.గంగారావు ఆ రోడ్డుపై పరిశీలనకు వెళ్లగా స్థానికులు పలు ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే ప్రభుత్వం ఆ రోడ్డుకు మంజూరు చేసిన నిధులను నిలుపుదల చేసి, ప్రతిపాదించిన ఇంజినీర్లపై చర్య తీసుకుని, ఆక్రమణకు గురైన చెరువును రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గంగారావ్..