ఆరోగ్యశ్రీని ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-20 15:15:05

వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం  ఆరోగ్యశ్రీ  కేలండర్ ను  జిల్లా కలెక్టర్ జె నివాస్ తో పాటు జిల్లా అధికారులంతా మంగళవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెలక్టర్ మాట్లాడుతూ, కేలండర్లో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు, వాటి ఫోన్ నంబర్లు, ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు, లభించే స్పెషాలిటీ సేవల వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. వై. యస్.ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ప్రచురించిన ఈ కేలండర్లను జిల్లాలో గల అన్ని సచివాలయాలకు ప్రజలకు సమాచారం అందించేందుకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పై గ్రామసచివాలయాల ద్వారా సిబ్బంది, వాలంటీర్లుకు ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని వివరించారు. ఈ  కార్యక్రమంలో ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.