విద్యార్ధి దశనుంచే చట్టాలపై అవగాహన పెరగాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-10-20 17:12:50

విద్యార్థి దశలోనే ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని లోక్ అదాలత్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి.బులి కృష్ణ అన్నారు. మంగళవారం న్యాయ సేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల విద్యార్థులతో ఆన్లైన్లో నిర్వహించిన ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. విద్యార్థులకు న్యాయమూర్తి ,రాజ్యాంగం, ప్రాధమిక న్యాయశాస్త్రాలపై అవగాహనా కల్పించారు. న్యాయమూర్తితోపాటు లోక్ అదాలత్ సభ్యురాలు సీనియర్  న్యాయవాది బి.పద్మజారాణి విద్యార్థుల  హక్కుల గురించి వివరించారు.  కన్స్యూమర్ కోర్ట్ న్యాయాయవాది యు.యెన్ రావు గారు విద్యార్థులకు కన్స్యూమర్ కోర్ట్ విధి విధానాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో  రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల అధినేత  ఎ. కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపాల్  జి.వి.రవీంద్రుడు,  వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస రావు,  సోషల్ స్టడీస్ టీచర్ .ఐ.థామస్ , విద్యార్థులు పాల్గొన్నారు.