స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధస్థానం దిశగా కష్టపడాలి..


Ens Balu
5
2020-10-20 21:19:15

స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానమే లక్ష్యంగా శ్రమించి పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజున అధికారులను ఆదేశించారు. మంగళవారం విఎంఆర్డీఏ ఎరీనా చిల్ద్రెన్ ధియేటర్ లో శానిటరీ ఇన్స్పెక్టరులు, శానిటరీ కార్యదర్శుల సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో  ప్రధమ స్థానం సాధించాలంటే శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు ఇప్పటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఓడబ్ల్యూఎంఎస్ స్కానింగు గేట్స్ తక్కువుగా ఉన్న 10 వార్డులను గుర్తించి ఆయా వార్డు శానిటరీ ఇన్స్పెక్టరులకు షో కాజ్ నోటీసు ఇచ్చి 3 రోజులలోగా వివరణ తీసుకోవాలని అదనపు కమిషనర్ వి. సన్యాసి రావు ఆదేశించారు. మరల రిపీటు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పలు వారులలోని స్కేనర్లు కనిపించక పోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తపరుస్తూ మొత్తం 1950 స్కేనర్లు ఉండాలని,  కనిపించకుండా పోయిన స్కేనర్ల ను వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి నంబరు తీసుకోవాలన్నారు. వార్డు కార్యదర్శులు ఉదయం 6గం.ల నుండే విధులలో హాజరు కావాలని అన్నారు. వార్డు కార్యదర్శులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. స్కేనింగు గేట్సు తక్కువుగా ఉన్న వార్డు పరిధిలోని సచివాలయాల శానిటరీ కార్యదర్శుల డైరీలను పరిశీలించారు. డైరీ లేకుండా వచ్చిన 36వ వార్డు శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తపరుస్తూ    సమావేశం నుండి బయటకు పంపించారు. ఉద్యోగంలో చేరి సంవత్సరకాలం పూర్తీ అయినప్పటికీ వార్డు శానిటరీ కార్యదర్శులు తమ విధులపై పూర్తీ అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకపై అలా జరగకూడదని హెచ్చరించారు. అదనపు కమిషనర్ దా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ సర్వీసు రిక్వెస్ట్ లు 40కి పైగా సచివాలయాలలో ఒక్కటీ నమోదు అవకపోవడం పై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇక ప్రతీ వార్డులోని సర్వీసు రిక్వెస్ట్ నమోదు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. సర్వీసు రిక్వెస్ట్ లో సమాదానం ఒకే  పదంలో కాకుండా, 2 లేక 3 వాక్యాలలో ఉండాలని సూచించారు. సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ జాబ్ చార్టు ప్రకారం ఉదయం 6గం. ల నుండే శానిటరీ కార్యదర్శులు విధులలో ఉండాలని, డైరీలో ప్రతీ రోజూ చేసిన పని వివరాలు ఉండాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు, ఒక టీంగా కూర్చొని మైక్రో పోకెట్స్ వైజ్ పని వివరాలు చర్చించుకోవాలన్నారు. బయట ఏరియాలలో ఎక్కడ బడితే అక్కడ చేపల వ్యాపారం జరుగుతుందని, అలా జరగకుండా సచివాలయ శానిటరీ కార్యదర్శులు  చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.