శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సిజె..
Ens Balu
2
Tirumala
2020-10-20 21:33:46
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మంగళవారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి కలిసి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడసేవలో ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అదనపు ఈవో ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. సీజె వెంట ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) సదా భార్గవి, బోర్డు సభ్యులు రామేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మురళీకృష్ణ, డా. నిశ్చిత, జి.వి.భాస్కర్‌రావు, పుత్తా ప్రతాపరెడ్డి, శివకుమార్, శివశంకరన్, గోవిందహరి, డిపి.అనంత, కుమారగురు, రమేష్ శెట్టి, సిహెచ్.ప్రసాద్, దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పి ఎ.రమేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.