రైతులను తక్షణమే ఆదుకోవాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-10-21 14:57:17
విశాఖజిల్లాలో అధిక వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, కౌలురైతులకు ప్రభుత్వం నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం డిమాండ్ చేశారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అప్పులను ప్రభుత్వం మాపీ చేయాలన్న ఆయన జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పూర్తి నష్ట పరిహారం చెల్లింపునకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టనమోదు తొందరగా పూర్తిచేసి పంట నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని, ఎకరా వరికి రూ.25వేలు, చెరకుకు రూ. 60 వేలు, ఉద్యాన పంటలకు రూ. 50వేలు చొప్పున ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు, కౌలురైతుకు పంట పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోని 359 గ్రామాల్లో 15,087 మంది రైతులకు చెందిన 15,810 ఎకరాల పంటలు నీటమునిగాయని వివరించారు. అందులో వరి-13,647.5, చెరకు-1932.5, మొక్కజొన్న-22.5, పత్తి-82.5, రాగులు (చోళ్లు)-87.5, చిరుధాన్యాలు-5, రాజ్‌మా చిక్కుల్లు- 20, పొగాకు-12.5 ఎకరాలకు నష్టం జరిగింన్నారు. అధికారిక లెక్కల్లోనికి రాని, తమలపాకులు, ఆకుకూరలు వగైరా నీటమునిగిన పంటలు మర్ని వున్నాయన్నారు. వాటిని గుర్తించి రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఈ -క్రాప్‌లో నమోదుకాని రైతులకు కూడా పరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేశారు.