2 నుంచి గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షలు..


Ens Balu
2
Srikakulam
2020-10-21 19:23:51

శ్రీకాకుళం జిల్లాలో  నవంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు గ్రూప్ – 1 సర్వీస్( మెయిన్స్ ) పరీక్షలు జిల్లాలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్   నిర్వహించే  ఈ గ్రూప్ – 1 పరీక్షలు Descriptive type లో ఉంటాయని, ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం.వరకు పరీక్షలు నిర్వహించబడతాయని కలెక్టర్  పేర్కొన్నారు. పరీక్షల వివరాలు ఈ విధంగా ఉంటాయని అన్నారు. నవంబర్ 2 - పేపర్ ఇన్ తెలుగు ( Qualifying Nature ), నవంబర్ 3-పేపర్ ఇన్ ఇంగ్లీష్ ( Qualifying Nature ), నవంబర్ 5  - పేపర్ – 1, నవంబర్ 7-పేపర్ –2, నవంబర్ 9 -పేపర్ -3, నవంబర్ 11-పేపర్ -4, నవంబర్ 13- పేపర్ -5 ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 268 మంది అభ్యర్ధులు  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారని, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో 200 మంది, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో 68 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ వివరించారు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.