పులస వేట బంగ్లాదేశ్ లో నిషేధం..


Ens Balu
1
Srikakulam
2020-10-21 19:27:13

పొలస(హిల్సా) చేపలు సంరక్షణలో భాగంగా బంగ్లాదేశ్  ప్రభుత్వం పొలస తల్లి చేపల వేటను నిషేధించిందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాస రావు బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 14వ తేదీ నుండి నవంబరు 4వ తేదీ వరకు పొలస (హిల్సా) తల్లి చేపల సంరక్షణ ప్రచారంలో భాగంగా పొలస తల్లి చేపల వేటను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించారని చెప్పారు. ఈ మేరకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ విభాగం జాయింట్ సెక్రటరీ సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ రాష్ట్ర మత్స్యకారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసారని చెప్పారు. పొలస చేపల సంరక్షణ ప్రచార సమయములో పొలస(హిల్సా) చేపలు పట్టుట, అమ్ముట, రవాణా చేయుట బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించిందని అన్నారు. దీనిని గమనించి మత్స్యకారులు ఎవరు బంగ్లాదేశ్ ప్రభుత్వ పరిధిలో బంగాళా ఖాతం  సముద్ర జలాల్లో  వేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. ఇంటర్నేషనల్ మెరిటైమ్  బోర్డరు లైను దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో  ఎవరైనా మత్స్యకారులు చేపల వేట చేయుచూ బంగ్లాదేశ్ నేవీ, కోస్ట్ గార్డ్ కు పట్టు బడితే  అరెస్ట్ కాబడి తీవ్రమైన పరిణామలకు గురి కాగలరని ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అత్యంత జాగ్రత్త వహించాలని, ఎట్టి పరిస్ధితుల్లోనూ బంగ్లాదేశ్ జలాల్లో పొరపాటన కూడా వేటకు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేసారు.