దుఖాణదారులు నిబంధనలు పాటించాలి..


Ens Balu
3
Srikakulam
2020-10-21 19:38:09

శ్రీకాకుళం జిల్లాలో దుకాణదారులు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అన్ని రకాల దుకాణదారులు, సినిమా హాళ్ళు, హోల్ సేల్ వర్తకులు తదితరులతో నగర పాలక సంస్ధ కార్యాలయంలో బుధ వారం సమీక్షించారు. కోవిడ్ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైందని, అయితే ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని జాయింట్ కలెక్టర్ అన్నారు. జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి పూర్తిగా వైరస్ నిర్మూలన జరిగినట్లు కాదని గ్రహించాలని ఆయన స్పష్టం చేసారు. ప్రపంచంలో రెండవ దశ వ్యాప్తి ప్రారంభం అయినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, కేరళ వంటి రాష్ట్రాల నుండి ఎక్కువ కేసులు నమోదు అవుతున్న పరిస్ధితులను గమనిస్తున్నామని చెప్పారు. వీటన్నింటి దృష్ట్యా ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోవిడ్ తో అస్వస్తతకు గురై చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్న వారిలో సైతం శ్వాస, గుండె తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. ఏ ఒక్కరూ కోవిడ్ భారీన పడకూడదని, అందుకు తగిన ముందస్తు చర్యలు మేలు చేస్తాయని చెప్పారు. కిరాణా దుకాణాలు, సినిమా హాల్స్, వస్త్ర దుకాణాలు, హోల్ సేల్ తదితర అన్ని విభాగాల దుకాణదారులు స్వయంగా మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించడమే కాకుండా, భౌతిక దూరం పాటించాలని, తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన సూచించారు. దుకాణాలు, సినిమా హాల్స్ కు వచ్చే ప్రతి వ్యక్తి కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత దుకాణ యజమానులదేనని అన్నారు. థర్మల్ స్కానర్లు, మాస్కు, ఫేస్ షీల్డు, శానిటైజర్లు ఏర్పాటు చేయడమే కాకుండా బౌతిక ధూరం పాటించడం విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు.  ఈ సమావేశంలో నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, వర్తక, వ్యాపార సంఘ ప్రతినిధులు అంధవరపు రాము, కోణార్క్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.