కరోనాపై మరింత అవగాహన పెంచుకోవాలి..


Ens Balu
2
Beach Road
2020-10-21 20:12:01

కరోనా వైరస్ పై ప్రజలు మరింతగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని జిల్లా కలెక్టర్, జీవిఎంసీ స్పెషల్ ఆఫీసర్ వి.వినయ్ చంద్ కోరారు.  బుదవారం బీచ్ రోడ్డు లో కోవిడ్ నియంత్రణ చర్యలపై జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, జిల్లా జాయింట్ కలక్టరు తో కలసి అవగాహన ర్యాలీ ప్రారంబించారు. జిల్లా కలక్టర్ వినయచంద్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ కోవిడ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో తగు జాగ్రత్తగా  వ్యవహరించాలని, అప్రమత్తతో మెలగాలని లేకపోతే రెండవ దశ ప్రారంభమైతే పెను ప్రమాదం తప్పదని ప్రజలకు సూచించారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, చేతులు సబ్బుతో గాని శానిటైజర్ తో గాని శుభ్రంగా కడుగుకోవాలని, మార్కెట్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మొదలగునవి సందర్శించినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ అరుణ్ బాబు, డిఎంఓహెచ్ డా. పి.ఎస్. సూర్యనారాయణ, ఏ.ఎం.సి ప్రెసిడెంట్ డా. పి.యు. సుధాకర్, డి.ఇ.ఎం.ఓ. రత్నకుమారి, జివిఎంసి అదనపు కమిషనర్లు ఆశాజ్యోతి, రమణి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ప్రదాన ఇంజినీరు వెంకటేశ్వరరావు, రెండవ జోన్ కమిషనర్ శ్రీనివాస్,  ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి) వై. శ్రీనివాస రావు, డి.సి(ఆర్) ఫణిరాం, ఏ.డి.హెచ్. ఎం.దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీరులు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.