మాస్క్ ధారణ, సామాజిక దూరం తప్పని సరి..


Ens Balu
1
కలెక్టరేట్
2020-10-21 20:22:31

కోవిడ్-19 పై జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కోవిడ్ -19 ఎప్రాప్రియేట్ బిహేవియర్ పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకొని పండగ సమయంలో గుంపులుగా లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, హైస్కూల్స్, కళాశాలు, పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్, పురుగు మందుల షాపులు, మెడికల్ షాపులు, తదితరమైనవి కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటేషన్ చేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కోవిడ్ నివారణ పై ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తమ స్వంత ఖర్చులతోనే ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు.  పంచాయితీ, మున్సిపాలిటీల పరిధిలో హోర్డింగ్ లన్నీ 10 రోజులు పాటు కోవిడ్ నివారణ ప్రచారానికే వినియోగించాలని చెప్పారు.  ఆర్.టిసి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, హాస్పిటల్ ల్లో బ్యానర్లు, పోస్టర్లు డిసిప్లే చేయాలని పేర్కొన్నారు. మసీదులు, దేవాలయాలు, చర్చ్ లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జియస్టి కార్యాలయాలు, బార్లు, బెవరేజస్ కార్పొరేషన్ లు, ఎక్సైజ్ కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, ప్రైవేట్ బస్సులు, లారీ, టాక్సీలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.   పెట్రోల్ బంకులు, పురుగు మందుల షాపులు, మెడికల్ షాపులు, స్విమ్మింగ్ ఫూల్స్, రేషన్ షాపులు, పర్యాటక స్థలాలు, తదితర వాటిలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.  గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓలు, తహసిల్థార్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ఆర్.టి.సి.లో ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.  డిపోలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.  మాస్క్ లు, శానిటైజర్లు  అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు కోవిడ్-19 ఎప్రాప్రియేట్ బిహేవియర్ పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలు, హోటల్స్, పర్యాటక ప్రాంతాలు, తదితర వాటిలో మాస్క్ లేనిదే ప్రవేశం లేదని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ చేసుకోవాలని చెప్పారు.  ఈ సమావేశంలో  జివిఎంసి కమిషనరు జి సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డిఎస్ఓలు నిర్మలాభాయ్, శివ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, డిపిఓ లింగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.