కోవిడ్ నిబంధనలు అమలు చేయాల్సిందే..


Ens Balu
3
జీవిఎంసి కార్యాలయం
2020-10-21 20:40:20

మహావిశాఖ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థ యాజమాన్యాలు కోవిడ్ నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన స్పష్టం చేశారు. బుదవారం జివిఎంసి సమావేశ మందిరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, షాప్ కీపర్స్, మర్చంట్ అసోసియేషన్లు, చలన చిత్ర థియేటర్ యజమాన్యాలు, వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల సభ్యుల తో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు తూ.చ. తప్పకుండా వ్యాపారాలు చేయాలని, మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ థియేటర్ మరియు మాల్స్ లలో గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలని కోవిడ్ లక్షణాలు ఉంటే లోనికి అనుమతించకూడదని సూచించారు, చిన్న పిల్లలు, గర్బిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రవేశంనకు అనుమతిలేదన్నారు.   ప్రభుత్వ నిబంధనల ప్రకారము పెద్ద పెద్ద మాల్స్, థియేటర్లలో 50శాతం కంటే ఎక్కువగా లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. డిస్ప్లే బోర్డులు, “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి ప్రజలకు మీవంతు అవగాహన కల్పించాలన్నారు. డస్ట్ బిన్స్, బాత్రూములను శుభ్రంగా ఉండే విధంగా చూడాలని, వీలైనంత వరకు స్కేనర్ వాటర్ ట్యాప్ లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం కోవిడ్ మరల రెండో దశ మొదలైందని తగు జాగ్రత్తలు పాటింఛి వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మా సిబ్బంది తనిఖీ నిమిత్తం వచ్చినప్పుడు, మీరు వారికి సహకరించాలన్నారు.  జాయింట్ కలక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, ప్రతీ థియేటర్, మాల్స్, కిరాణా షాపులు, మెడికల్ షాపుల వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఫ్లెక్షీలు, బ్యానర్లు, డిస్ప్లే బోర్డులు  పెట్టాలన్నారు. థియేటర్స్ లో టికెట్స్ చేతికి ఇవ్వకుండా ఆన్లైన్ మెసేజ్ ద్వారా లోపలకి పంపే విధంగా చూడాలని సాధ్యమైనంతవరకు ఫుడ్ కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూడాలన్నారు.             ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశాజ్యోతి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్.  డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశమునకు హాజరైన వివిధ వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. అనంతరం, వివిద వ్యాపార ప్రతినిధులు, సంస్థలలో కోవిడ్ పై అవలంబిస్తున్న పద్దతులను వివరించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశా జ్యోతి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్.డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డి.సి.(ఆర్) ఫణిరాం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి, షాపింగ్ మాల్స్ ప్రతినిదులు, మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, సినిమా థియేటర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.