ఆకతాయిలు వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయండి...
Ens Balu
4
East Godavari
2020-07-20 06:24:30
సచివాలయ మహిళా వాలంటీర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా సచివాలయంలోని సంప్రదించాలని సచివాలయ పోలీసు అధికారిణి జిఎన్ఎస్ శిరీష అన్నారు. సో మవారం శంఖవరం గ్రామసచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో మహిళల రక్షణ, అంగన్వాడీల పర్యవేక్షణ, మహిళల ఆశ్రమాల సందర్శన స చివాలయం తరపున చేపడతామన్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు మహిళా వాలంటీర్లను వేధిస్తున్నట్టు తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తిం చి అన్నవరం స్టేషన్ కి అప్పగిస్తామన్నారు. ఏ మహిళకు కష్టమొచ్చినా నేరుగా సచివాలయనికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే దిశ కాల్ సెం టర్ కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు. వాలంటీర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆమె మీడియాకి వివరించారు. ప్రతీరోజూ నిర్వహించే స్పందనలో దరఖాస్తు చే సుకుంటే మహిళల సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.