కరోనా తగ్గలేదు.. జాగ్రత్తలు పాటించాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-22 15:21:14

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదని, పైగా కొత్తకేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ జె నివాస్ అన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణ అవగాహన కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రెండవ దశ వ్యాప్తి ప్రారంభమైందని అన్నారు. రవాణా రంగం ప్రాధాన్యత కలిగిన రంగమని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి  ప్రమాదకర పరిస్థితిలో ఉన్న సమయంలో  ముందుకు వచ్చి సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తగ్గుముఖం పట్టిందని ప్రజలు అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.  వర్షా కాలం, చలికాలంలో వైరస్ వ్యాప్తి, శ్వాస సంభందించిన సమస్యలు ఎక్కువగా వస్తాయని గమనించాలని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వ్యాప్తి ప్రారంభం అయిందని గుర్తించాలని అన్నారు. వాహనాలను శానిటేషన్ చేయాలని ఆదేశించారు.    జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా తగ్గలేదు, జాగ్రత్తలు పాటించాలని  అన్నారు. మాస్కె కవచం అన్నారు. నో మాస్కు - నో ఎంట్రీ నినాదం పాటించాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని అన్నారు. భౌతిక దూరం పాటించాలని, చేతులు సబ్బుతో గాని, శానీటైజరుతో గాని తరచూ శుభ్రపరచుకోవాలని అన్నారు. చేతులలో ముఖాన్ని తాకారాదని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఎక్కించారాదని ఆయన స్పష్టం చేశారు.  ఏ వ్యక్తి తోను ఎక్కువ సమయం మాట్లాడరాదని అన్నారు. ఆ వ్యక్తి పాజిటివ్ అయితే వైరస్ సోకుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేరళలో అధిక కేసులు వస్తున్నాయని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణీకులను ఆటోలు, టెక్సీ లలో ఎక్కించారాదని చెప్పారు. వాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని పిలుపునిచ్చారు. కోవిడ్ అవగాహనలో భాగంగా అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి సరాసరిన 30 మందికి అంటించగలరని చెప్పారు. ఎక్కడా రద్దీ లేకుండా చూడాలని అన్నారు. భౌతిక దూరం పాటించక పోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని తెలిపారు.   పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అన్ లాక్ 6లో సడలింపులు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారాని పేర్కొన్నారు. కోవిడ్ ఇంకా తగ్గలేదని, ఎక్కువ మంది ప్రయాణీకులను ఎక్కించారాదని ఆయన స్పష్టం చేసారు. మీకు వైరస్ వస్తే కుటుంబ సభ్యులకు వస్తుందని గుర్తించాలని కోరారు. ఎక్కువ మందిని ఎక్కించి అధికంగా డబ్బులు సంపాదించే ఆలోచన చేయవచ్చు, కానీ కుటుంబ సభ్యులకు వైరస్ సోకితే అయ్యే ఆసుపత్రి ఖర్చులను గమనించాలని సూచించారు. మీ ఆరోగ్యం దృష్ట్యా మీరే పోలీసు అన్నారు. నియంత్రణ చేసుకోవాలని పిలుపునిచ్చారు.   రవాణా శాఖ ఉప కమీషనర్ డా.వి.సుందర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నివారణకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఆటో చోదకులు జాగ్రత్తలు చేపట్టడం వలన కోవిడ్ భారీన పడలేదని పేర్కొన్నారు. తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్నామని, అయితే ఇప్పుడే అసలు ఆట మొదలైందని గమనించాలని కోరారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారి వాహనాలను సీజ్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ సి.హెచ్.జి.వి.ప్రసాద్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వేణుగోపాల్, పి.శివరాం గోపాల్, ఆటో, టేక్సీ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.