స్వీయ రక్షణతోనే కరోనా నియంత్రణ..


Ens Balu
3
Prakasam
2020-10-22 19:54:06

కరోనా వైరస్ పట్ల స్వయం రక్షణ పాటించే విధంగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ ఆదేశించారు. గురువారం మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజార్ లో మార్కాపురం, ఎర్రగొండ పాలెం,గిద్దలూరు నియోజక వర్గాల సంబంధించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, మహిళా సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు , డి.ఆర్.డి.ఏ ఏరియా కో ఆర్డినేటర్ల కు కరోనా వైరస్ స్వయం రక్షపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి గ్రామ స్థాయిలో వ్యవస్థ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందువలన  కరోనా వైరస్ కేసులు జిల్లాలో తగ్గాయన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గ్రామ  స్థాయిలో నిర్వహించాలని ఆధికారులను ఆదేశించామన్నారు. అవసరమైన వారికీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ జిల్లాలో కరోనా వైరస్  సోక కుండా స్వీయరక్షణ చేసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో కరోనా వైరస్ రక్షణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో నవంబర్ 2తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించ నున్నామన్నారు. గ్రామాల్లో కరోనా వైరస్ ను నియంత్రణ కు గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో గ్రామ ఐక్య సంఘాల సభ్యులు కరోనా వైరస్ నియంత్రణకు స్వయం   రక్ష తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న 7లక్షల స్యయం సహాయ సంఘాలు కరోనా వైరస్ పట్ల  అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ నుండి జిల్లా ప్రజలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్2 టి.ఎస్.చేతన్,వైద్య విధాన పరిషత్ కో ఆర్డినటర్ ఉషా, మహిళా శిశు సంక్షేమ శాఖ పి.డి లక్ష్మీదేవి, డి.ఆర్.డి.ఎ పి.డి ఎ. ఏలీషా,జిల్లా పరిషత్ ఎ. ఓ వెంకటేశ్వరరావు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.