తడి-పొడి చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టాలి..


Ens Balu
1
Visakhapatnam
2020-10-22 20:28:35

జివిఎంసీ పరిధిలోని డోర్ టు డోర్  తడి, పొడి వేరు చేసిన చెత్త సేకరణ ఖచ్చితంగా సేకరించాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం, నగరంలోని 57వ వార్డు నరవ తదితర ప్రాంతాలలో పర్యటించి డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గెడ్డలు, కాలువలలో చెత్త వేయరాదని స్థానికులకు సూచించారు. అలా డ్రైనేజీల్లో చెత్తవేసేవారికి ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా డ్రైనులు శుభ్రపరిచి వ్యర్ధాలను తరలించాలని సిబ్బందికి సూచించారు. వాణిజ్య సముదాయాలలో కలిగిన ట్విన్ బిన్స్ లో రోజూ వ్యర్ధాలను తరలించాలని శానిటరీ అధికారులకు ఆదేశించారు. కార్మికుల పనితీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. పలు దుకాణాలను సందర్శించి పర్యావరణానికి హాని కలిగించే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు వాడరాదనీ హెచ్చరించారు. ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.