రూ.26 లక్షలతో అభివృద్ధి పనులు..


Ens Balu
3
Srikakulam
2020-10-23 23:02:08

శ్రీకాకుళం జిల్లాలో నగరపాలక సంస్థ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో  సుమారు రూ.26 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని 30వ డివిజన్ నందు గల ఏ.పి.హౌసింగ్ బోర్డు కాలనీలో సిమెంట్ కాలువల శంకుస్థాపన కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాదారణ నిధులతో ఈ అభివృద్ధి పనుల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగానే హౌసింగ్ బోర్డు కాలనీలోని 300ఎం.ఎం, 450ఎం.ఎం సిమెంట్ కాలువల నిర్మాణంతో పాటు యం.ఐ.జి 299 నుండి 318 వరకు 450 ఎం.ఎం సిమెంట్ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. వీటికోసం సుమారు రూ.26.00 లక్షలు నగరపాలక సంస్థ నిధులను వెచ్చిస్తుందని చెప్పారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని ఎప్పటికపుడు పూర్తిచేసేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిర్మాణపు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. వర్షాకాలం కావడంతో పనులకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ కె.దక్షిణామూర్తి, సహాయ ఇంజినీర్ వెంకటరావు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.