బాక్సింగ్ క్రీడాకారిణికి ఘన సత్కారం..
Ens Balu
4
జివిఎంసి కార్యాలయం
2020-10-23 23:16:04
అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నెగిశెట్టి ఉషాను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో ఘనంగా సత్కరించారు. విశాఖ వాసిగా అంతర్జాతీయ బాక్సింగ్ లో భారత ప్రభుత్వం ద్వారా జ్ఞానచంద్ అవార్డుతో పొందడం అభినందనీయమన్నారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని పతకాలు సాధించి దేశానికి, విశాఖకు మరింత కీర్తి తీసుకు రావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఇంతటి ప్రతిష్టకు కారణమైన గురువు ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లును కూడా కమిషనర్ సత్కరించి ఆయన సేవలు కొనియాడారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, ఆమె మన విశాఖ వాసి కావడం అందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు అశాజ్యోతి, డా. వి. సన్యాసి రావు, ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి.) వై. శ్రీనివాస రావు వారి ఇరువురిని అభినందించారు.